పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 60 ఫిర్యాదులు

విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం

– జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 30 :

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన  “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్  ఫిర్యాదిదారుల నుంచి 60 ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి  ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Scroll to Top