

రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసిన వాహనాలను టోయింగ్ వెహికల్స్ ద్వారా పార్కింగ్ ప్రదేశాలకు తరలింపు
భక్తులు తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే నిలుపుకోవాలని పోలీసు అధికారుల విజ్ఞప్తి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :
నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రం నందు ఉగాది మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం నిమిత్తం విచ్చేయుచున్న భక్తులతో శ్రీశైల క్షేత్రం రద్దీగా మారింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రతాపరంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్. యుగంధర్ బాబు ఆధ్వర్యంలో శ్రీశైల క్షేత్రం నందు పోలీస్ అధికారులు భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల క్రమబద్ధీకరణకు మొబైల్ వాహనాలను ఉపయోగించడం మరియు ఇదివరకే రోడ్లపై వాహనాలు నిలపరాదని మీడియా ద్వారా మరియు దేవస్థానం వారి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ కొంతమంది వాహనదారులు ఇతర వాహనాలకు ఇబ్బందికరంగా ట్రాఫిక్ అంతరాయం కలిగేలా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్క్ చేసుకోవడం జరిగింది.సదరు వాహనాలను పోలీస్ అధికారులు టోయింగ్ వెహికల్స్ ద్వారా పార్కింగ్ ప్రదేశాలకు తరలించడం జరుగుతుందని తెలియజేశారు. కావున భక్తులు తమ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసుకోకుండా రింగ్ రోడ్డు వైపు గల విశాలమైన పార్కింగ్ ప్రదేశాలలో మరియు ఆర్టీసీ బస్టాండ్ వైపు గల పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే నిలుపుకోవాలని పోలీసు అధికారులు తెలియజేయడం జరుగుతుంది.
