గుడ్ ఫ్రైడే సందర్భంగా…ప్రతి లైన్ లోనూ ‘జీసస్’ నామమే కనిపించేలా అద్భుత చిత్రం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 02 :
నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీకి చెందిన దియ్య మాణిక్యరావు తనలోని వినూత్న కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. వృత్తిరీత్యా ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్న మాణిక్యరావు, గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని ఏసుక్రీస్తు యొక్క అద్భుతమైన చిత్రాన్ని గీశారు. సాధారణంగా చిత్రపటాలు గీతలు, రంగులతో కూడి ఉంటాయి. కానీ మాణిక్యరావు గీసిన ఈ చిత్రంలో ప్రతి గీత వెనుక “జీసస్” అనే పేరు నిక్షిప్తమై ఉండటం విశేషం. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి, ఎంతో ఏకాగ్రతతో ఈ క్యాలిగ్రఫీ స్టైల్ డ్రాయింగ్‌ను ఆయన పూర్తి చేశారు.
“మానవాళి పాప పరిహారం కోసం ఏసుక్రీస్తు సిలువపై తన ప్రాణాలను అర్పించారని, ఆయన చిందించిన రక్తం, పొందిన గాయాల పట్ల ఉన్న కృతజ్ఞతను, క్రీస్తుపై ఉన్న ఇష్టాన్ని తన డ్రాయింగ్ ద్వారా తెలియజేస్తున్నానని” మాణిక్యరావు తెలిపారు. చేతులు, కాళ్లలో మేకులు కొట్టి హింసించినా, లోకం కోసం తన ప్రాణాన్ని సమర్పించిన ఆ దేవుని త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Scroll to Top