సార్వత్రిక సమ్మె ర్యాలీ, బహిరంగ సభ విజయవంతం, వేలాదిగా పాల్గొన్న కార్మికులు

నాలుగు లేబర్ కోడ్ లను  జి.రాం.జీ. చట్టాన్ని ఉపసంహరించుకునే అంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తాం – కార్మిక సంఘాలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 12 :

కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను అమలు చెయ్యాలని, మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం యధావిధిగా అమలు చేసి 200రోజులు పని కల్పించి, 600 రూపాయలు కూలి వేతనం ఇవ్వాలని,జి.రాం.జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎరువుల ధరలను తగ్గించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని,వడ్డీ లేకుండా బ్యాంకులలో రుణాలు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం చేపట్టే ఫిబ్రవరి 12న జాతీయ సమ్మెలో కలిసి ఐక్యంగా పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు కనువిప్పు కలగాలని ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  టేక్కే మార్కెట్ యార్డ్ నుండి బయల్దేరి పద్మావతి నగర్, శ్రీనివాస్ సెంటర్, కల్పనా సెంటర్ మీదుగా గాంధీ చౌక్ చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు చౌడప్ప రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏ రాజశేఖర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిఐటియు సీనియర్ నాయకులు తోట మద్దులు,సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి. లక్ష్మణ్, బాలవెంకట్,సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కే మహమ్మద్ గౌస్, పి వెంకట లింగం, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మురళి, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షులు భూమని శ్రీనివాసులు,ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం నిర్మలమ్మ, జిల్లా నాయకులు డి. నిర్మలమ్మ, రమణమ్మ, కరీమున్నిసా, మదార్ బీ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గంధం రమణకుమారి,జిల్లా నాయకురాలు శివమ్మ, షమీమ్, తిరుపాలమ్మ, శివలక్ష్మి, సుభద్ర, సుజాత, భ్రమరాంభిక లతో పాటు సీఐటీయూ  గా 1500మంది కి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతరం గాంధీ చౌక్ సెంటర్లో జరిగిన బహిరంగ సభ కార్యక్రమానికి సిఐటియు అధ్యక్షులు కే మహమ్మద్ గౌస్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించడం జరిగింది.అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు చౌడప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏ రాజశేఖర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్  మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు 10 లక్షల కోట్లకు పైగా రాయితీలను ఇచ్చి పేద ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించిందని ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా కుదింపు చేసి పరిశ్రమల యాజమాన్లకు కార్మికులను నయా బానిసలుగా చేసే విధంగా నాలుగు లేబర్ కోర్స్ ఉన్నాయని వాటి వలన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యంగా సమ్మె చేసే హక్కు కోల్పోవడం జరుగుతుందని యాజమాన్లు ఇచ్చింది తీసుకోవాలి అదనంగా పని గంటలు పెంచేలా వేతనాలను యాజమాన్ల కు నచ్చే రీతిలో ఇచ్చే పద్ధతిని అవలంబిస్తుందని యాజమాన్లకు నచ్చకపోతే కార్మికులను ఉద్యోగం నుండి తొలగించవచ్చని కార్మిక శాఖ కూడా ఏమి చేయలేదని వారికి ఎలాంటి అధికారాలు లేకుండా చేసిందని కార్మికులను రోబోలుగా చిత్రికరించే ప్రయత్నం చేస్తుందని, ప్రపంచ దేశాలు సైతం ఎనిమిది గంటల పని విధానాన్ని అనుసరిస్తుంటే మన దేశంలోని కార్మికులు మాత్రం 13 గంటలు పాటు పనిచేయాలని చట్టాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గమని ఈ చట్టం ద్వారా కార్మికులు మరింతగా నష్టపోయి జీవచ్చవాలుగా మిగిలే అవకాశం ఉందని అన్నారు.మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం యధావిధిగా అమలు చేసి 200రోజులు పని కల్పించి, 600 రూపాయలు కూలి వేతనం ఇవ్వాలని,జి.రాం.జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎరువుల ధరలను తగ్గించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని,వడ్డీ లేకుండా బ్యాంకులలో రుణాలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా  సమ్మె జయప్రదం చేశారని రాబోయే కాలంలో కౌలు రైతులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యావత్ కార్మిక వర్గం అంతా పాల్గొని కేంద్రం మెడలు వంచి కార్మిక వర్గం సత్తా  చూపించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సార్వత్రిక సమ్మెకు సిపిఎం, సిపిఐ మద్దతు:

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ర్యాలీలో పాల్గొని, గాంధీచౌక్ సెంటర్లో జరిగిన  మద్దతు తెలిపేందుకు బహిరంగ సభ లో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు విచ్చేసి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఉద్యోగులకు ప్రజలకు అవసరమైనటువంటి విధానాలను ఏ విధంగా తొలగించాలి ఇబ్బందులకు గురిచేయాలి తన అనుమాయులైన అంబానీ, ఆదానీలకు, విదేశీ సంస్థలకు ఏ విధంగా లాభాలు చేకూర్చాలని పనిలో నిమగ్నమై నాలుగో లేబర్ కోర్టులను తీసుకువచ్చి కార్మికులను నయా బానిసలుగా చేయడం సరైనది కాదని వెంటనే నాలుగు లేబర్ కోర్టులను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు జరిపేలా చూడాలని అదేవిధంగా భారతదేశ జాతిపిత అయిన మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ చట్టం లో తొలగించాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెంటనే ఉపాధి హామీ పథకాన్ని  గతం కన్నా మెరుగ్గా నిర్వహించేందుకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని గ్రామీణ ప్రాంతాన్ని నిరుద్యోగం నుంచి కాపాడాలని కోరారు వెంటనే జిరాంజి చట్టాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను సరుకులు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తినాలన్న కొనాలన్నా చాలా భయాందోళనకు గురవుతున్నారని కనీస వేతనాలు రావడం లేదు సరుకుల ధరలు వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి అని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందుతుందని, కోట్లాదిమంది కార్మికులు ఉద్యోగులు ప్రజలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను చాటినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇదే ఐక్యతను రాబోయే కాలంలో చాటి చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే రాబోయే కాలంలో యావత్ కార్మిక వర్గం అంత చేపట్టే ఉద్యమానికి వామపక్ష పార్టీలుగా మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యక్ష ఆందోళనలో పూనుకుంటామని మోడీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసేలా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పోరాటాలలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

Scroll to Top