

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 12 :
నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో గురువారం పి4 కార్యక్రమం, వివిధ సర్వేల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డిఎల్డిఓ, మెప్మా పీడీ వెంకట దాస్, సిఎంఎం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న యుఎఫ్ఎస్ సర్వే, పి4 బంగారు కుటుంబాల పరస్పర సమావేశాలు, వాట్సాప్ పరిపాలన, తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణ, పౌరుల పెండింగ్ ఈకేవైసీ నమోదు, సచివాలయ కార్యదర్శుల హాజరు, రెవెన్యూ పన్నుల వసూళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
అన్ని సర్వేలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, పౌరుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. రెవెన్యూ పన్నుల వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
