‘బ్లేజింగ్ రాకెట్స్ – 2026’ పోస్టర్‌ను ఆవిష్కరించిన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 21 :
నంద్యాల స్థానిక శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22, 23 తేదీలలో నిర్వహించ తలపెట్టిన వార్షిక క్రీడా వేడుకలు ‘బ్లేజింగ్ రాకెట్స్ – 2026’ కు సంబంధించిన గోడపత్రికను (పోస్టర్) ను నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ శనివారం ఆవిష్కరించారు.
నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాఠశాల యాజమాన్యం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, ఈ క్రీడా సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం కోసం విద్యార్థులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంతటి భారీ స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్స్ చైర్మన్ సుధాకర్ , వివిధ పాఠశాలల కరస్పాండెంట్ ఇసాక్ వలి , వికాస్ వలి, ఉత్తేజ్ , హుస్సేన్ భాష, అభ్యుదయ వలి మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
