

నంద్యాల జిల్లా / జనవరి 01- 2026 / సత్యం వార్త ప్రతినిధి :
నూతన సంవత్సరా న్ని పురస్కరించుకుని నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి నివాసం వైకాపా శ్రేణులతో కిక్కిరిసింది. నియోజకవర్గంలోని వివిధ – మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ అభిమాన నాయకుడిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో శిల్పా నివాసానికి చేరుకుని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి వారందరినీ ఆప్యాయంగా పలకరించి, కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ఏడాది సుఖశాంతులు చేకూరాలని ఆయన కోరుకున్నారు.
