శానిటేషన్ పనులపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 04  :

నంద్యాల పట్టణంలో శానిటేషన్ పనుల అమలుపై మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న శనివారం ఆకస్మికంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, చెత్త సేకరణ కేంద్రాలు, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించి శుభ్రత పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

శానిటేషన్ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మున్సిపాలిటీ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. చెత్త సకాలంలో సేకరణ, డ్రైనేజీ శుభ్రత, దోమల నివారణ చర్యలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

పనితీరులో లోపాలు కనిపించిన చోట బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుభ్రత విషయంలో ఎలాంటి అలసత్వం లేకుండా ప్రతిరోజూ పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు.

ఈ తనిఖీల్లో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విక్రమ్, శభరిష్, శానిటేషన్ సూపర్వైజర్లు లక్ష్మీనారాయణ, శివ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top