వైసీపీ నేత దేశం సుధాకర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి బుగ్గన, మాజీ ఎంపీ

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 20 :

నంద్యాల జిల్లాలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. బైక్ పై వెళ్తూ గాయాలు కావడంతో నేడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. సుధాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని,. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని ఆయనను పరామర్శించారు. పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

https://satyamvaarthatelugudaily.com

Scroll to Top