

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 08 :
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి
సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తాను
మంత్రి నారా లోకేష్ మాట్లాడిన వీడియో మీరే చూడండి
నంద్యాల తులసిరెడ్డి కి మంత్రి నారా లోకేష్ ప్రశంస
చప్పట్లు కొట్టిన కార్యకర్తలు
టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేస్తా
కార్యకర్తల సమస్యలు ధైర్యంగా చెప్పండి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 08 :
మంగళ గిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాపులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నా పై ఆగ్రహం వ్యక్తం చేశారని కొందరు వైసిపి మూకలు అసత్య ప్రచారాన్ని సీనియర్ న్యాయవాది,మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ఖండించారు.ఈ సందర్భంగా ఆయన ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశం అక్కడ జరిగిన అంశాలు,విడియో మీడియా కు అందించి వాస్తవాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ జరిగిందన్నారు.రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు హాజరయ్యారన్నారు.సమావేశంలో సాయంత్రం నాలుగు గంటలకు నాకు అవకాశం వచ్చిందన్నారు.ఆళ్లగడ్డ నియోజక వర్గం లోని బూత్ లలో నెలకొన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చానన్నారు.బూత్ లలో కార్యకర్తల సమస్యలు స్థానిక ఎమ్మెల దృష్టికి తీసుకొచ్చానన్నారు.ప్రధానంగా తహశీల్దార్,పోలీస్ స్టేషన్ లలో ఇంకా వైసిపి కి మద్దతుగానే అధికార యంత్రాంగం పనిచేస్తున్న విషయాన్నిమంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చా అన్నారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తులసిరెడ్డి అంటే ఉమ్మడి జిల్లాలో మీరు అందరికీ తెలుసు,వారికి మీరు తెలుసని ప్రశంసలు కురిపించడంతో అందరు చప్పట్లు కొట్టారు.రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బూత్ సమస్యలు తెలుసన్నారు.బూత్ కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసని కార్యకర్తలు ఎవరు ఇబ్బందులు పడకుండా ఇంచార్జ్ మినిస్టర్ తో మాట్లాడి జిల్లా ఎస్పీ,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు.కార్యకర్తలు సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం గా బయట పెడితే కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని అన్నారు.మంగళగిరిలో జరిగింది ఒకటి అయితే నా పై కక్షతో కొందరు వైసిపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.వాస్తవాలు తెలుసుకొని పోస్టింగ్స్ పెట్టాలన్నారు.సోషల్ మీడియా లో అవాస్తవాలు రాసిన వారిపై పరువునష్టం దాఖలు చేస్తానని హెచ్చరించారు..మంగళగిరిలో జరిగిన సమావేశం విడియో లను మీడియా కు అందించి అక్కడ జరిగిన విషయం మీరే చూడాలని పేర్కొన్నారు.కళ్ళతో చూసి,చెవులతో విన్నట్టు వైసిపి ముఖాలు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.
