విష్ణ హాస్పిటల్ 1వ వార్షికోత్సవ సందర్భంగా తలసేమియా చిన్నారులకై  స్వచ్ఛంద రక్తదానం ఏర్పాటు

మార్చి 30వ తేదీన తలసేమియా చిన్నారులకై ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం పోస్టర్ విడుదల

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 24 :

నంద్యాల పట్టణం లోని విష్ణ హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ నందు మొదటి వార్షికోత్సవం సందర్భంగా తలెసేమియా చిన్నారుల కోసం స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.విష్ణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్.జె.వికాస్ స్వయంగా రక్తదానం చేశారు.అలాగే హాస్పిటల్ సిబ్బంది మరియు యువకులు రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు.అనంతరం  మార్చి 30వ తేదీన జరిగే ఫన్ రైసింగ్ ప్రోగ్రాం పోస్టర్ ను విడుదల చేశారు.ఈ ప్రోగ్రాం నందు 5560 విలువగల పరీక్షలు మరియు డాక్టర్స్ కన్సల్టేషన్ ను కేవలం 499 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు.అలాగే ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం కు వచ్చిన నగదు మొత్తాన్ని తలసేమియా చిన్నారుల పౌష్టికార్ధం మరియు మందులు,ఇతర ఖర్చులకి వారి కుటుంబాలకు అందజేస్తామని విష్ణ హాస్పిటల్ డా.జె.వికాస్ మరియు యాజమానం తెలిపారు.ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు విష్ణ హాస్పిటల్ రాబోయే రోజుల్లో చెయ్యనుందని తెలిపారు.నంద్యాల బ్లడ్ బ్యాంక్ సెంటర్ మేనేజర్ బ్లడ్ అచ్చు మాట్లాడుతూ విష్ణ హాస్పిటల్ నంద్యాలలో ఎన్నో సేవా కార్యక్రమాలలో పేరుగాస్తుందని,పట్టణ ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు.ఇలాంటి సేవలు చేస్తున్నందుకు మరియు తలసేమియా చిన్నారుల కోసం తమ వంతు సాయం అందిస్తున్నందుకు విష్ణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.వికాస్ కు మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విష్ణ హాస్పిటల్ డా.వికాస్,డా.కృష్ణ సాహితీ,డా.వెంకట మనోహర్,హాస్పిటల్ జనరల్ మేనేజర్ కరీం,బ్లడ్ అచ్యుత్,బ్లడ్ ప్రవీణ్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top