విద్యార్థినిలకు రక్షణ కల్పించలేని వెంకటేశ్వర విద్యా మందిర్ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

అక్రమ వసూళ్లతో ధనమే ధ్యేయంగా విద్యాశాఖాధికారులు

వెంకటేశ్వర విద్యా మందిర్ పాఠశాలపై చర్యలేవి? విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

  • పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 08  :

నంద్యాల పట్టణంలోని వెంకటేశ్వర విద్యా మందిర్ పాఠశాలలో విద్యార్థిని పట్ల తోటి విద్యార్థుల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు మానసిక వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన పాఠశాల యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో తోటి విద్యార్థినులు తమకు పాఠశాలలో రక్షణ లేదని తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ తెలిపారు. బుధవారం నాడు ఎస్ఎండి రఫీ పత్రికా ప్రకటన విడుదల చేశారు . ఈ సందర్భంగా పి. డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎం డి రఫీ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ పాఠశాలలో కరస్పాండెంట్ వెంకటరమణ పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరకొర వసతులతో నిర్వహిస్తున్న వెంకటేశ్వర విద్యా మందిర్ పాఠశాల యాజమాన్యం విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. తక్షణమే వెంకటేశ్వర విద్యా మందిర్ పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలో విద్యాశాఖ అధికారులు ధనమే ధ్యేయంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పాఠశాలలకు సరైన అనుమతులు లేకున్నా పాఠశాలలో అసభ్య సంఘటనలు జరిగినకూడా నేటికీ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం సరైనది కాదని అన్నారు. నంద్యాల జిల్లాలో ఎంఈఓ, డీఈఓ లకు పెద్ద మొత్తంలో పాఠశాల నుండి మామూలు అందుతున్నాయని అన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి నంద్యాల జిల్లాలోని విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో పాఠశాల ఎదుట ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

Scroll to Top