

సత్యం వార్త / విజయవాడ / మార్చి 28 :
విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, బుడగ జంగాల కాలనీ మరియు ఎస్పీవై రెడ్డి స్మార్ట్ సిటీ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్తో వార్డు ఇంచార్జ్ తాటికొండ బుగ్గ రాముడు చర్చించారు.
ఈ సందర్భంగా ఆయా కాలనీలకు అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, మంచినీటి సరఫరా వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జంగిల్ క్లియరెన్స్ వంటి సమస్యలపై కూడా వివరించారు.
ఈ సమస్యలపై స్పందించిన మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
