రెవెన్యూ క్లినిక్ అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సమస్యలు రాకూడదు

పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి

  • జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 22 :
రెవెన్యూ క్లినిక్ అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పేర్కొన్నారు. గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ కలెక్టరేట్లోని విసి హాల్ నుంచి రెవెన్యూ క్లినిక్, పట్టాదారు పాస్ పుస్తకాలు, రీ సర్వే స్టేటస్, పిజిఆర్ఎస్ రీ ఓపెన్ అర్జీలు, జాయింట్ ఎల్పిఎమ్స్ తదితర అంశాలపై నంద్యాల డివిజన్ ఆర్డిఓ, తాసిల్దారులు, వీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది భూ బాధితులను పదేపదే కార్యాలయాలు చుట్టూ తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు భూ సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో రైతుల నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఆర్డీవో, తాసిల్దార్ తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలు కుల ధ్రువీకరణ పత్రాలు, వివిధ సమస్యలపై తాసిల్దార్ కార్యాలయానికి అందజేసిన అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. రీ ఓపెన్ అయిన అర్జీలపై దృష్టి సారించి బాధితులకు నాణ్యమైన పరిష్కార నివేదిక అందజేసి అర్జీలను క్లోజ్ చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలు రెవిన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులకు కూలంకుషంగా వివరించి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, ల్యాండ్ అండ్ సర్వే ఏడి, వీఆర్వోలు సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top