

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 19 :
పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని పేద నిరాశ్రయులకు నంద్యాల వాసి ప్రముఖ వ్యాపార వేత్త, సామాజిక వేత్త,గోళ్ళ రాజేష్ ఆదేశాలతో నంద్యాల పట్టణ ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు సీనియర్ రిపోర్టర్ నూర్ భాషా ఆధ్వర్యంలో పేదలు, నిరాశ్రయులకు దాదాపు 200 మందికి పుల్కాలు ,జొన్న రొట్టెలు, కలర్ రైస్ పప్పు,కర్రీ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ ఇంచార్జ్ ఎన్.ఎం.డి. ఫయాజ్ పాల్గొన్నారు వారి చేతులమీదుగా పేద, నిరాశ్రయులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ నూర్ భాషా మాట్లాడుతూ గతంలో నుండి కూడా గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు తన ద్వారా చేపిస్తున్నందుకు గోళ్ళ రాజేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా దాదాపు మూడున్నర నెలల నుండి నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు,ఆర్థిక సహాయ,సహకారాలు పేదలకు కేవలం ఒక్క రూపాయికే ఆహార పదార్థాలు రుచికరమైన కలర్ రైస్ కర్రీ అందిస్తున్నారని ఈ సందర్భంగా నంద్యాల ప్రజల నుండి గోళ్ళ రాజేష్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. పేద నిరాశ్రయులకు ఉచితంగా పుల్కాలు,కర్రీ,పప్పు,కలర్ రైస్ అందించమని ఆదేశించడం జరిగిందని రానున్న కాలంలో గోళ్ళ రాజేష్ మరిన్ని సేవా కార్యక్రమాలు నంద్యాల నియోజకవర్గంలో అందించనున్నారని ఇంకా ఎన్నో నూతన పథకాలు కూడా నంద్యాల నియోజకవర్గం ప్రజలకు అందించేందుకు కూడా ప్రణాళికలు జరుగుతున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ ఇంచార్జ్ ఎన్.ఎం.డి.ఫయాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ ఇన్చార్జ్ ఎన్.ఎం.డి.ఫయాజ్ మాట్లాడుతూ గతంలో కూడా గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో 200 మందికి పైగా పేద నిరాశ్రయులకు పంపిణీ చేశామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా మూడు నెలలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలను గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంను తాను గమనిస్తున్నట్టు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలను గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నందుకు గోళ్ళ రాజేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో తన వంతు సహాయంగా తన సహకారాలు అందిస్తానని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చాంద్ బాషా,కలాం,మన్సూర్,మహమ్మద్ మొహమ్మద్ ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు.
