‘మై టిడిపి’ యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 21 :

తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు మరియు పార్టీ సమాచారాన్ని కార్యకర్తలకు వేగంగా చేరవేసేందుకు రూపొందించిన ‘మై టిడిపి’ యాప్ పోస్టర్‌ను నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ శనివారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని “స్టేట్ టు బూత్ – లీడర్ టు కేడర్” అనే నినాదంతో ఈ యాప్‌ను పార్టీ రూపొందించిందని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలపై సంబంధించిన సమాచారం క్షణాల్లో కార్యకర్తల మొబైల్‌కు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ నేరుగా కార్యకర్తలకు అందుతుందని . పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు . యాప్ వినియోగంలో ఏవైనా సందేహాలు ఉంటే 8886629888 నంబర్‌కు ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు. నంద్యాల నియోజకవర్గంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, రంగ ప్రసాద్, గోవింద నాయుడు,భాస్కర్, సైలాబ్, నూనెపల్లె జయప్రకాష్ (జెపి), బాలు, జార్జ్, శరత్ పాల్గొన్నారు.

Scroll to Top