
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 13 :
నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం వివిధ సర్వేల పురోగతిపై మున్సిపల్ కమిషనర్ బి శేషన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సచివాలయ సిబ్బంది కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శానిటేషన్ సూపరైజర్ లక్ష్మీనారాయణ, శివ ప్రసాద్ రెడ్డి, ఆర్ ఓ వెంకట రెడ్డి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శభరిష్. విక్రమ్. తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న యుఎఫ్ఎస్ సర్వేలు, వాట్సాప్ పరిపాలన అమలు, తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణ, పౌరుల పెండింగ్ ఈకేవైసీ నమోదు, సచివాలయ కార్యదర్శుల హాజరు, రెవెన్యూ పన్నుల వసూళ్ల అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సర్వేలలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితత్వంతో నమోదు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న ఈకేవైసీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, బయోమెట్రిక్ నవీకరణ పూర్తి స్థాయిలో జరగాలని ఆదేశించారు.
రెవెన్యూ పన్నుల వసూళ్లలో శాతం పెంపు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. బకాయిల వసూళ్లపై దృష్టి సారించి, వార్డు వారీగా సమీక్షలు నిర్వహించాలని తెలిపారు.
సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి సాధించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశమని కమిషనర్ పేర్కొన్నారు. సమావేశంలో సంబంధిత విభాగాల అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు.
