వెంటనే స్పందించి గుడ్లు సరఫరా చేసిన అధికారులు


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 02 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉన్న మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం అందరికీ తెలిసిందే . పాఠశాలలోని వసతులను, విద్యా బోధనను పరిశీలించిన మంత్రి ఫరూక్ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించగా, మెనూ ప్రకారం ఉండాల్సిన గుడ్లు లేకపోవడాన్ని మంత్రి ఫరూక్ గమనించారు. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని హెచ్చరించారు. వెంటనే మంత్రి ఫరూక్ సంబంధిత విద్యాశాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి, గుడ్ల పంపిణీలో జరుగుతున్న లోపాలను ప్రశ్నించారు. మంత్రి ఫరూక్ ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గంటల వ్యవధిలోనే స్పందించి నంద్యాల డీఈవో జనార్దన్ రెడ్డి, ఎంఈఓ బ్రహ్మం నాయక్ పాఠశాలకు అవసరమైన గుడ్ల నిల్వలను సరఫరా చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని . మధ్యాహ్న భోజనం విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని. ప్రతి విద్యార్థికి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి అని ఆదేశించారు.
