
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 08 :
రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు, బుధవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 96 నూతన కోర్టులను మంజూరు చేశారని . ఇందులో భాగంగా నంద్యాల జిల్లాకు 4 కోర్టులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కోర్టుల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1734 పోస్టులను ప్రభుత్వం విడుదల చేసిందని. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన, ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు రోస్టర్ విధానం అనుసరించి అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ ఉద్యోగాల పేరుతో కొందరు మధ్యవర్తులు లేదా దళారులు అమాయక యువతను మోసం చేసే అవకాశం ఉందని . మంత్రి ఫరూక్ గారి పేరు గాని, నా పేరు (ఫిరోజ్), ఫయాజ్ లేదా మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మకండి. మాతో దిగిన ఫోటోలను చూపించి, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే ప్రలోభాలకు గురికావద్దు అని ఫిరోజ్ స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినా లేదా ఉద్యోగాల పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు వస్తాయని ఆశపడి నిరుద్యోగులు తమ జీవితాలను పాడు చేసుకోవద్దని తెలిపారు.
