



రాయలసీమ జీవనాడి బానక చర్ల ప్రాజెక్ట్ ల పరిశీలన..
పార్నపల్లె గ్రామ విబిజి రామ్ జి ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి కార్యక్రమం.
-జిల్లా కార్యవర్గ సమావేశంలో బిజెపి గ్రామ స్థాయి బలోపేతం చెయ్యాలని దిశా నిర్దేశం.
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 02 :
బిజెపి, కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి అధ్యక్షతన, బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సమన్వయ సహకారంతో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి నంద్యాల జిల్లా పర్యటన లో భాగంగా బానకచర్ల ప్రాజెక్ట్ సందర్శన, పార్నపల్లె గ్రామంలో విబిజి రాంజీ గ్రామీణ ఉపాధి, జీవనోపాధి శ్రామికులతో ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు చిగురు పాటి కుమార స్వామి శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని తెలుగు గంగా, ఎస్సార్ బీసీ, గాలేరు నగరి కేసి కెనాల్ ఎస్కెప్ ఛానెల్ కాలువలు ద్వారా ఎన్ని క్యూసెక్కులు సాగు నీరు రాయలసీమ కు అందుతుందని, రాయలసీమ ప్రాంతంలో సంపూర్ణ నీటిని వినియోగించు కొంటున్నారా లేక ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, బిజ్జం సుబ్బారెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ సాగునీటి శాశ్వత పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్తానని, అక్కడే ఉన్న ఎస్సార్ బీసీ పాత కెనాల్ పూడ్చివేత పైన ఆరా తీశారు. ఈ సందర్బంగా అక్కడకు వచ్చిన రైతులు ప్రక్కనే ఉన్న శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ తమ పొలాలకు అందటం లేదని, కానీ ఎక్కడో ఉన్న నెల్లూరు, చిత్తూరు, మద్రాస్ పట్టణాలకు తరలించుకొని పోతున్నారని కళ్ళ ముందే కరువు ప్రస్తుత పాలకులకు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మా సమస్యను మీరైనా పరిష్కారించి, బీడుగా మారుతున్న పొలాలకు సాగు నీటిని అందించాలని రైతులు కోరారు. తదనంతరం పార్నపల్లె గ్రామంలో జరిగిన వీబిజి రామ్ జి కార్యక్రమంలో ఉపాధి, జీవనోపాధి శ్రామికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వీబిజి రాంజీ పధకం పైన ప్రజలలో ఉన్న ఆ పోహాలు సందేహాలు నివృత్తి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఉన్న లోపాలను సరిచేసి ఉపాధి శ్రామికులకు అనేక ప్రయోజనములు చేకూర్చారు అని తెలిపారు. అనేక సంక్షేమ పధకాలు అందించి గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవ నోపాధి అందించాలని సంకల్పంతో పని చేస్తున్నారని తెలిపారు.
తదనంతరం జయంత ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నంద్యాల జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో బిజెపి పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారం లోకి రావాలంటే గ్రామ స్థాయి నుండి కమిటీల నిర్మాణం, మండల కమిటీ నిర్మాణం బలంగా ఏర్పాటు చెయ్యడం తో పాటు గ్రామాలలో సమస్యలు పట్ల అవగాహన కలిగి ప్రజలు అవసరాలు గుర్తించి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేసి, పార్టీ బలోపేతం చెయ్యాలని అన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలలో విజయం సాధించే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్తలు కృషి చెయ్యాలని సూచించారు.
రాష్ట్రంలో కిసాన్ మోర్చా జిల్లా కమిటీని ముందంజలో వేశారని అభినందనలు తెలియ జేశారు. జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామికి పర్యటన సందర్భంగా అభినందనలు తెలిపారు. జోనల్ ఇన్చార్జ్ తిమ్మారెడ్డి, జిల్లా కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి, నాగరాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
