
విశాఖపట్నం లో AISF, AIYF, అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు పై పెట్టినటువంటి అక్రమ కేసులను రౌడీషీట్‌ను, పీడియాక్టులను రద్దు చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాలలో ప్రెస్ మీట్
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి /జనవరి 7 : ప్రశ్నించే వారి పైన కేసులు తిరిగేస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటే, పిడి యాక్ట్ పెడతాం అంటే పుట్టగతులు ఉండవు CM, విద్యాశాఖ మంత్రి తస్మాత్ జాగ్రత్త.
ప్రశ్నిస్తే సిపిఐ, AISF,AIYF నాయకులపై కేసులు పెడతారా? మీరు సమస్యలు లేకుండా చేయండి ప్రశ్నించే వారు ఉండరు..అధికారం రాకముందు నీ పాదయాత్రలో విద్యార్థి, యువజన ప్రజా సంఘాల బుజాలపై చేసి వేసిన విషయం మర్చిపోయావా నారా లోకేష్?
పాదయాత్ర లో ఇచ్చిన హామీలు గుర్తులేవా అని నారా లోకేష్ ను ప్రశ్నించిన AIYF నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు. కమ్యూనిస్టుల పై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు.
ఖబడ్దార్ ఖబడ్దార్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్..
విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీ షీట్,రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అప్పలరాజు పైన పెట్టిన పీడి యాక్ట్ లను ఎత్తివేయాలి..
సిపిఐ నంద్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్మీట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, ఎన్ టి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి ప్రతాప్, డెమొక్రటిక్ విద్యార్థి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రియాజ్, ఏఐవైఎఫ్ నాయకులు ధనుంజయ్ లు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు సమావేశాలు పెట్టి పాదయాత్రలు నిర్వహించి ఆయా జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి యువజన రంగాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని అదేవిధంగా విద్య వైద్యం ఉపాధి హక్కులను అందరికీ అందజేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో నెలకొన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మోడల్ స్కూల్స్ లో అభివృద్ధి చేయాలని కేజీబీవీ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి అన్ని రకాల విద్యార్థులకు మెస్సు కాస్మోటిక్ బిల్లులను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని, మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో అమలు చేయడానికి రద్దు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విశాఖపట్నంలోని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకుల పైన ఐదు మంది పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీ సీట్లను ఓపెన్ చేయడం, అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు పైన పిడిఎఫ్ నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయ్యా మీరు సమస్యలను పరిష్కారం చేయండి మిమ్మల్ని ప్రశ్నించేవారు ఉండరు మీరు సమస్యలు పరిష్కారం చేయకపోగా సమస్యలు పరిష్కరించమని అడిగేటువంటి కమ్యూనిస్టుల పైన అక్రమ కేసులు బనాయించాలని చూస్తే కమ్యూనిస్టు పార్టీగా కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి యువజన సంఘాలుగా, కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలుగా ప్రజాసంఘాలుగా చూస్తూ ఊరుకోం అని నంద్యాలలో సిపిఐ కార్యాలయంలో ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రెస్మీట్లో వారు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్రమంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, నాయకుల పైన పెట్టినటువంటి క్రిమినల్ కేసులను రౌడీషీట్‌ను తక్షణమే తొలగించాలని తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు కలిసి వచ్చినటువంటి విద్యార్థి యువజన ప్రజాసంగాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని, ఎక్కడికక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన వయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
