

భూ కబ్జాదారులపై సీఎం చంద్రబాబుకు పిర్యాదు.
- మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి.
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 21 :
ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఇంటి స్థలాలు ఇచ్చిందని, ఆ స్థలాలు కబ్జా చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని వికలాంగులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికీ ఈ సమస్య తీసుకొని వెలుతానని, వికలాంగులకు న్యాయం జరిగేందుకు తాను అండగా ఉంటానని, భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వంకు చెడ్డపేరు వస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డి నివాసం లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ 2004 వ సంవత్సరంలో నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులో సర్వే నెంబర్ 229A, 229V లో 12 ఎకరాల 5 సెంట్ల స్థలాన్ని తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో నేను వికలాంగులకు ఇంటి స్థలాలకు కేటాయించడం జరిగిందనీ. 450 ప్లాట్లను పంపిణీ చేశామన్నారు. నా హయం తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిన వికలాంగుల ను ఎవ్వరూ కదిలించలేదన్నారు. దివ్యాంగులకు హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న మేము వీరు భవిష్యత్తు బాగు పడితే ఒక 4000 మందికి నివాసం ఏర్పాటు చేసిన వారమౌతమని అనుకున్నాం అన్నారు.
అయితే ఇప్పుడు ఒక దేవాదాయ శాఖ వారు ఒక బోర్డును వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో బోర్డు ఏర్పాటు చేశారని, అక్కడి భూమిలో గల స్థలాన్ని చదను చేయించి ఒక టీడీపీ నాయకుడు కబ్జా చేయాలని ప్రయత్నం చేయడం చూస్తే వీరి ఆగడాలకు అంతులేకుండా పోతున్నాయని బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చాలా స్థలాలను కబ్జా చేస్తూ దౌర్జన్యాలకు పలుకుతున్న వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాననీ, దేవాదాయశాఖలో కలుపుకుని ఈ వికలాంగుల స్థలాన్ని కొట్టేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని. ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి వీరి పనులు జరిపించుకోవడం చేస్తున్న వీరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని. వికలాంగులకు జరుగుతున్న ఈ అరాచక అన్యాయాన్ని కచ్చితంగా అడ్డుకుని వీరి న్యాయం జరిగేంతవరకు పోరాటం సాగిస్తామని బైరెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. నందికొట్కూరు నియోజకర్గమే కాకుండా నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలా వికలాంగులకు ఒకకాలనీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నితాను కోరుతున్నానన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా వికలాంగులకు ఇంటి స్థలాలను కేటాయించడం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నందికొట్కూరు నియోజకవర్గంలోనే జరగడం విశేషం అన్నారు. వీరికి ఇలా సాయం చేయడమే మేము చేసిన తప్పా అని కబ్జా చేస్తున్న వారిని అడుగుతున్నానని బైరెడ్డి నిలధీశారు.
