ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం – రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్

  • నంద్యాలలో ఘనంగా “ప్రజా దర్బార్”
  • అర్జీలను స్వయంగా స్వీకరించి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 20 :

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని త్వరితగతిన పరిష్కరించడమే ధ్యేయంగా రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఫరూక్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి వద్ద నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి, జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ… “ప్రజల చెంతకే పాలనను తీసుకురావాలన్నది మన ప్రభుత్వ సంకల్పం అని. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు. అర్జీదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడటమే మా ప్రాధాన్యత అన్నారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ పక్షాన నిరంతరం అందుబాటులో ఉంటాం” అని హామీ ఇచ్చారు.

https://satyamvaarthatelugudaily.com

Scroll to Top