పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 93 ఫిర్యాదులు

విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం

  • జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 19 :
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 19-01-2026) నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఫిర్యాదిదారుల నుంచి 93 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదులలో కొన్ని:
1).2025 జూన్ నెలలో గిద్దలూరు గ్రామం చెందిన పొంకం.భూషణం అనే వ్యక్తి మా పొలానికి వెళ్లే రాస్తాను గుంత కొట్టి మూసివేశాడు. మేము రాస్తాలో వెళ్లి పొలం దున్ను కోవడానికి వెళ్ళు తుంటే అతని పలుకుబడి వినియోగించి మమ్ములను బెదిరిస్తు ఉన్నాడు. దీని వలన నా పొలం 5 ఎకరములు బీడు పెట్టుకోవలిసి వచ్చిందని కావున పొంకం నాగభూషణం పై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చెయ్యండని కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన మూల.వెంకటేశ్వరరెడ్డి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
2).నా భర్త చిన్న యోబు ప్రతిరోజు మద్యం తాగి వచ్చి నన్ను నా పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని నాకు న్యాయం చేయండని గోవింద పల్లె గ్రామానికి చెందిన రామలక్ష్మ్మ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
3).భూమి కొలతలకు ఆటంకం కలిగిస్తూ వారసత్వంగా మాకు రావలసిన బంగారం ,నగదు ఇవ్వకుండా అక్రమంగా అడ్డుకుంటున్న పెద్ద నారాయణరెడ్డి పై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయండని ఈర్నపాడు గ్రామానికి చెందిన హరికుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

4).హైదరాబాదులో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాదుకు చెందిన R. సంపత్ కుమార్ రెడ్డి నా వద్ద నుండి 6,60,000/-రూపాయలు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా నమ్మించి మోసం చేశాడని నాకు న్యాయం చేయండని నంద్యాల పట్టణానికి చెందిన శ్రీధర్ రావు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

Scroll to Top