- ఉగాది-రంజాన్ పండుగల సందర్భంగా భారీగా కిట్ల పంపిణీ
- గోళ్ళ రాజేష్ సేవా కార్యక్రమం – పండుగ కిట్లతో ప్రజలకు తోడ్పాటు
- ధాతృత్వమే పరమావథిగా.. మానవసేవయే మాధవ సేవగా..ముందుకెళ్తున్నారు గోళ్ళ రాజేష్




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :
నంద్యాల పట్టణంలోని ప్రజలకు గోళ్ళ రాజేష్ తన థాతృత్వం చాటుకుంటున్నారు. మానవసేవయే మాధవ సేవగా ముందుకెళ్తున్నారు నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్.
నంద్యాల నియోజకవర్గంలో గోళ్ళ రాజేష్ వ్యాపార నిమిత్తం స్థానికంగా అందుబాటులో లేనప్పటికీ కూడా నంద్యాల నియోజకవర్గ ప్రజలపై ఉన్న ప్రేమ , అభిమానాలతో గడిచిన నాలుగు నెలల పైగా కుల, మతాలకతీతంగా పేదల పెద్దన్నగా తనకు ఆర్థికంగా లక్షల రూపాయల ఖర్చు అవుతున్నప్పటికి ఎన్నో రకాలుగా తన వంతు సహాయ, సహకారాలు, ఆర్థిక సహకారాలు అందిస్తూ ముందుకెళుతున్నారు గోళ్ళ రాజేష్. అందులో భాగంగా ఈరోజు హిందూ సోదర, సోదరీమణులకు ఉగాది పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదర,సోదరీమణులకు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో ఆనందాలతో కుటుంబ సభ్యులతో పండుగలు నిర్వహించుకోవాలని సదుద్దేశంతో ఈరోజు 1000 మంది కుటుంబాలకు పైగా ఉగాది పండుగ సరుకులు, రంజాన్ పండుగ సరుకుల కిట్ల పంపిణీ గోళ్ళ రాజేష్ కార్యనిర్వాహకులు సీనియర్ రిపోర్టర్ నూర్ భాషా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గోళ్ళ రాజేష్ కార్య నిర్వాహకులు సీనియర్ రిపోర్టర్ నూర్ బాషా మాట్లాడుతూ పేదవారికి ఆత్మీయుడుగా ఇప్పటికే గోళ్ళ రాజేష్ నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో రకాలుగా వివిధ రూపాలలో వేలాదిమందికి సహాయ, సహకారాలు ఆర్థిక సహకారాలతో పాటు పేదలందరికీ తోడబుట్టినవాడుగా గోళ్ళ రాజేష్ తన వంతు సహకారాలు అందిస్తూ ఉన్నారు. తనకు ఆర్థికంగా ఎంత భారం ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్కచేయకుండా కేవలం పేదలకు సాయం చేయాలంటే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు గోళ్ళ రాజేష్ అని తెలిపారు. భవిష్యత్తులో గోళ్ళ రాజేష్ నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎన్నో మెరుగైన సేవాసహాయ,సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని నియోజవర్గ ప్రజలందరూ కూడా గోళ్ళ రాజేష్ ను భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా చూసి ఆశీర్వదించాలని ఎందుకంటే ఇలాంటి సేవ తత్పరత ఉన్నటువంటి వారిని భగవంతుడు చల్లగా చూస్తే ఇలాంటి వారు భవిష్యత్తులో ప్రజలకు ఇంకా ఎన్నో సేవాసహాయ,సహకారాలు అందించేందుకు ముందుంటారని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా గోళ్ళ రాజేష్ ని అతని మంచి మనసును ఆశీర్వదించి భగవంతున్ని ప్రార్థించాలని వారు తెలిపారు.
