నిబద్దత కలిగిన వ్యక్తి మాదాల శ్రీనివాసులు

తుది శ్వాస వరకు నమ్ముకున్న లక్ష్యం కోసం పని చేశారు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 21 :

*విద్యార్ధి నాయకుడుగా సిపిఎం నాయకుడిగా, జర్నలిస్ట్ నాయకుడిగా విద్యార్ధి సమస్యలపైన, ప్రజల సమస్యపైన, జర్నలిస్ట్ ల సమస్యలపైన పని చేసిన వ్యక్తి మాదాల శ్రీనివాసులని, నమ్ముకున్న లక్ష్యం కోసం తుది శ్వాస కోసం పని చేసిన వ్యక్తి మాదాల శ్రీనివాసులని సిపిఎం జిల్లా కార్యదర్శి టీ. రమేష్ కుమార్ అన్నారు.శనివారం నంద్యాల పట్టణంలోని టీ. నరసింహయ్య భవన్ లో  సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మాదాల శ్రీనివాసులు సంస్మరణ సభను ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టీ. రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. నాగరాజు, సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి దర్శనం. లక్ష్మణ్,ముస్లిం మైనార్టీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ అబ్దుల్ సమద్ తదితర నాయకులు మాదాల శ్రీనివాసులు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు.ఈ సందర్బంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ  మాదాల శ్రీనివాసులు ఆర్డనంతరంగా మృతి చెందడం బాధాకరమని ఆయన లేని లోటు ప్రజా తంత్ర ఉద్యమానికి తీరని లోటన్నారు. 1984-85 మధ్యలో ఎస్ ఎఫ్ ఐ విద్యార్ధి ఉద్యమంలో పని చేస్తూ అటు విద్యార్థుల సమస్యలపైన, తరువాత యువజన నాయకుడిగా వార్డ్ లలో ప్రజా సమస్యల పైన పని చేశారన్నారు. తదనంతరం ప్రజాశక్తి లో చేరి తుది శ్వాస వరకు పాత్రికేయుడిగా ఒకే పత్రికలో కొనసాగరన్నారు. పాత్రికేయుడిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిక్కచ్చిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేశారాని, రైల్వే స్టేషన్ ఏరియాలో రోడ్డు సైడ్ చిన్న వ్యాపారుల సమస్యలపైన ఆయన పని చేశారన్నారు.తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం అహర్నిశలు పని చేశారాని ఆయన సేవలను రమేష్ కుమార్ కొనియాడారు.అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.నాగరాజు మాట్లాడుతూ పత్రికా రంగంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నీకచ్చిగా పని చేశారు. సమాజ మార్పులో శ్రీనివాసులు పని చేశారు. అయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు.

ముస్లిం మైనార్టీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ మాదల శ్రీనివాస్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని మంచి నిబద్దత కలిగిన వ్యక్తి. ఏదైనా ఒక సమాచారాన్ని వార్తరూపంలో ఇవ్వాలంటే లోతుగా అధ్యయనం చేసి వార్త ఇచ్చేవాడన్నారు.

సాహితి స్రవంతి లో కూడా బాగా పని చేసి సాహితి రంగాన్ని ముందుకు తీసుకెళ్లారని,ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం.లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్ధి, యువజన రంగంలో పని చేశారని పత్రికా రంగంలో సుదీర్ఘకాలం పాటు ఆయన ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా పనిచేశారన్నారు.ఆయన కోరుకున్న సమసమాజం కోసం మనం పని చేయాలన్నారు.అప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని అన్నారు. ఆయన కుటుంబానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు.ఈ కార్యక్రమం లో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట లింగం, ప్రజాశక్తి రిపోర్టర్, ఏపీ డబ్యూ జె ఎఫ్ నాయకులు మౌలాలి, జగన్, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.*

Scroll to Top