




ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10వేల రూపాయల బహుమతి
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 12 :
స్థానిక నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీ లోని నారాయణ పాండే హై స్కూల్ నందు “స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫెయిర్ 2026” ఘనంగా నిర్వహించడం జరిగింది. నారాయణ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ యాకూబ్, కరెస్పాండెంట్ ఇషాక్ వలి ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.హుస్సేన్ భాష, ఆపుస్మా డిస్టిక్ ప్రెసిడెంట్ బిజ్జం సుబ్బారెడ్డి, అపుస్మా డిస్టిక్ ట్రెజరీ ఎస్.హుస్సేన్ భాష లు (సాయి వాణి స్కూల్) పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథి అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.హుస్సేన్ భాష ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు నిర్వహించినటువంటి ప్రాజెక్టు వర్క్ లు వీక్షించడం జరిగింది. ఈ ప్రాజెక్టు వర్క్ విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, టెక్నాలజీ, పర్యావరణ వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో రకాలైన ప్రాజెక్టులను విద్యార్థులు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు వీక్షించినటువంటి అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చూసి మంత్రముగ్ధులు అయి, విద్యార్థులకు 10,000 రూపాయలు బహుమతిని ప్రకటించడం జరిగింది. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ వి.యాకుబ్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రకాల రంగాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను వీక్షించి, విద్యార్థులకు ప్రాజెక్టులో సహకరించినటువంటి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంశా పత్రాన్ని మరియు మెడల్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికాస్ పాఠశాల కరస్పాండెంట్ వలి, నలంద కరెస్పాండెంట్ ఉత్తేజ్, నవభారత్ పాఠశాల మోహిన్, జివిఆర్ అభ్యుదయ స్కూల్ కరెస్పాండెంట్ హుస్సేన్ వలి మరియు రవి, ఆల్ఫా పాఠశాల ఇర్ఫాన్ మరియు నారాయణ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
