
సత్యం వార్త / ఆళ్లగడ్డ క్రైమ్ / జనవరి 8 : ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ క్రైం నెం.: 136/2025, సెక్షన్లు: 409, 468, 471,472,474,475,477-A r/w 34 IPC And Sec 66(c)&(d) IT Act 2000.. ఫిర్యాది : ఎం. లక్ష్మీ దేవి, భర్త: విద్యా సాగర్, వయస్సు: 53 సంవత్సరాలు, జిల్లా ట్రెజరీ & అకౌంట్స్ ఆఫీసర్ (DTO), నంద్యాల.
ముద్దాయి: పటాన్ ఇంతియాజ్ అలీ ఖాన్, తండ్రి: పటాన్ నజీర్ అహ్మద్ ఖాన్, వయస్సు: 36 సంవత్సరాలు,
ఇంటి నెం. 5-351, విజయనగరం కాలనీ, ప్రొద్దుటూరు టౌన్ & మండలం, కడప జిల్లా.
అరెస్టు చేసిన ప్రదేశం ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామానికి వెళ్లే రోడ్డులోని గోపిరెడ్డి రూరల్ ఫార్మర్ వేర్‌హౌస్ సమీపంలో..
స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు :
1. రబ్బర్లా మెత్తగా ఉన్న రెండు తెల్లటి నకిలీ వేలిముద్రలు
2. ఒక HP ల్యాప్‌టాప్
3. ఒక VIVO Y29 మొబైల్ ఫోన్
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు, 08.01.2026 ఉదయం సుమారు 08:50 గంటలకు, ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామానికి వెళ్లే రోడ్డులోని గోపిరెడ్డి రూరల్ ఫార్మర్ వేర్‌హౌస్ సమీపంలో ఆళ్లగడ్డ డీఎస్పీ కె. ప్రమోద్ మరియు ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది.
కేసు వివరాలు: డిసెంబర్ 2025లో నిర్వహించిన ఏజీ ఆడిట్ సమయంలో, 2020 నుండి 2023 మధ్య కాలంలో, అహోబిలం మరియు నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCలు) నకిలీ జీత బిల్లులు సృష్టించి సుమారు రూ.1,00,16,901/-లను అక్రమంగా డ్రా చేసినట్లు గుర్తించబడినందున, నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైం నెం.136/2025 u/s 409, 468, 471,472,474,475,477-A r/w 34 IPC And Sec 66(c)&(d) IT Act 2000. కేసు నమోదు చేయబడింది.
దర్యాప్తులో, A1 పటాన్ ఇంతియాజ్ అలీ ఖాన్ 2019 నుంచి 2025 వరకు అహోబిలం మరియు నరసాపురం PHCలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసినట్లు వెల్లడైంది. ముద్దాయి తండ్రి మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్లో అటెండర్‌గా పనిచేస్తూ 16.09.2013న గుండె సంబంధిత వ్యాధితో మరణించగా, అనంతరం ముద్దాయి 23.01.2015న కారుణ్య నియామకంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. తదనంతరం 19.11.2019 నుండి 22.06.2025 వరకు అహోబిలం PHCలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, అదే సమయంలో అహోబిలం మరియు నరసాపురం PHCలకు ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించాడు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో, ముద్దాయి డా. వి. మునిసుధావాణి మరియు డా. నాగదాసయ్య అనే మెడికల్ ఆఫీసర్లకు సంబంధించిన నకిలీ వేలిముద్రలను M-సీల్ మరియు ఫెవికాల్ ఉపయోగించి, వారి తెలియకుండానే తయారు చేశాడు. ఈ నకిలీ వేలిముద్రలతో ఆరు డూప్లికేట్ CFMS ఐడీలను అక్రమంగా సృష్టించాడు. వాటి ద్వారా రెండు PHC లకు చెందిన రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ సిబ్బందికి సంబంధించిన జీత బిల్లులు, ప్రసూతి సెలవు బిల్లులు, FTA (ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్) బిల్లులను నకిలీగా తయారు చేసి, నకిలీ సంతకాలు పెట్టి, ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయానికి సమర్పించి మోసపూరితంగా బిల్లులు పాస్ చేయించుకున్నాడు.
సుమారు 93 నకిలీ బిల్లుల ద్వారా రూ.1,09,45,339/-లను అక్రమంగా డ్రా చేశాడు. ఇందులో రూ.1,00,16,901/-లను తన సోదరి పటాన్ మెహతాబ్ బున్నీసా బేగం బ్యాంక్ ఖాతాకు, *రూ.9,28,438/-లను తన స్వంత బ్యాంక్ ఖాతాకు జమ అయ్యేలా చేశాడు.
బిల్లులు సబ్ ట్రెజరీ కార్యాలయంలో శాంక్షన్ అయిన అనంతరం, నకిలీ బిల్లులను చించి కాలువలో పడేసి, నకిలీ సీల్స్‌ను కాల్చివేసి ఆధారాలను నాశనం చేశాడు. అక్రమంగా సంపాదించిన ప్రభుత్వ సొమ్ముతో ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాట్ కొనుగోలు చేసి రూ.77.50 లక్షలు ఖర్చు చేశాడు. అలాగే తన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.11,85,609/-ను ఫ్రీజ్ చేయడం జరిగింది, మొత్తం గుర్తించిన మొత్తం రూ.89,35,609/-. మిగిలిన డబ్బును తన తల్లి వైద్య ఖర్చులు మరియు వ్యక్తిగత అవసరాలకు వినియోగించాడు.
ఈ విధంగా, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ, పై అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ వేలిముద్రలు మరియు సీల్స్ తయారు చేసి, బోగస్ బిల్లులు సృష్టించి, సుమారు రూ.1,09,45,339/- (అక్షరాల కోటి తొమ్మిది లక్షల నలబై ఐదు వేల మూడు వందల ముప్పైతొమ్మిది రూపాయలు) ప్రభుత్వ నిధులను అక్రమంగా స్వంత అవసరాలకు వినియోగించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
