నంద్యాలలో ప్రతిభ కనబరిచిన ప్రవేట్ స్కూల్ విద్యార్థులకు అభినందనల వెల్లువ

విద్యార్థులను ఘనంగా సన్మానించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మే 02  :

నంద్యాల పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ‘స్కూల్ టాపర్స్’గా నిలిచిన విద్యార్థులను నంద్యాల మంత్రి గారి క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గార్లు ఘనంగా శాలువాలు కప్పి విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలైన రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ , ఎన్జీవోస్ కాలనీ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ , వికాస్ స్కూల్ , నలంద స్కూల్ , నవభారత్ స్కూల్ , జి.వి.ఆర్. అభ్యుదయ స్కూల్ , స్వామి వివేకానంద స్కూల్ , నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్

మరియు ఇతర పాఠశాలల టాపర్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా విద్యా రంగంలో ముందంజలో ఉండటం గర్వకారణమని, విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలకమని కొనియాడారు.

ఈ అభినందన కార్యక్రమంలో  నంద్యాల జిల్లా అపస్మా ప్రెసిడెంట్ బీజ్జం సుబ్బారెడ్డి , జిల్లా ట్రెజరర్ హుస్సేన్ భాష , జిల్లా ఉపాధ్యక్షులు వికాస్ వలి , టౌన్ గౌరవాధ్యక్షులు ఇషాక్ వలి , ఖాజా హుస్సేన్, ఉత్తేజ్, జి.వి.ఆర్. అభ్యుదయ వలి, రవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల సిబ్బంది మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top