

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 25 :
నంద్యాల ఎన్టీఆర్ షాది ఖానా లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ , యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఫయాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించిన జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు . 13 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని దాదాపు 900 కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు . నిరుద్యోగులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ప్రతి నెల జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ ఆశయమన్నారు . ఈ ఆశయానికి అనుగుణంగా మంత్రివర్యులు నారా లోకేష్ సారథ్యంలో ఖచ్చితంగా సాధిస్తామని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు .
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా నైపుణ్యభివృద్ధి ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కళ్యాణి, ప్లేస్మెంట్ ఆఫీసర్ సుబ్బన్న, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ మస్తాన్ వలి, 6 వ వార్డు టిడిపి ఇంచార్జి పల్లె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
