

పేద విద్యార్థులకు స్కూల్ కిట్లు, పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్
సత్యం వార్త / నంద్యాల / జనవరి 23 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు నంద్యాలలో అత్యంత ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని, సామాజిక సేవా దృక్పథంతో పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు మరియు స్కూల్ కిట్లను మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి కోసం, యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చదువుపై లోకేష్ కి ఉన్న మక్కువను దృష్టిలో ఉంచుకుని, వారి పుట్టినరోజున పేద విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
