నంద్యాలలో ఘనంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇఫ్తార్ విందు

ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్

15 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సేవా సంప్రదాయం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 04:
రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్  ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులందరూ ఐక్యంగా జరుపుకునే ఈ ఇఫ్తార్ విందును మంత్రి ఫరూక్ గత 15 సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. బుధవారం (మార్చి 4) రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మూలాసాగరంలోని మస్జీద్-ఎ-మహ్మదీయ మరియు మస్జీద్-ఎ-కౌసర్లలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, ఎన్ఎండి ఫయాజ్ ఇఫ్తార్ విందును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే ఈ విందు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మంత్రి ఫరూక్  దశాబ్ద కాలానికి పైగా నంద్యాల నియోజకవర్గంలో మత సామరస్యం చాటేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమని కొనియాడారు.
ఈ విందులో 31వ వార్డు టిడిపి ఇంచార్జి దీపక్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న ఉసేని, అజ్మీర్,జైలాన్ మరియు స్థానిక ముస్లిం పెద్దలు, మత గురువులు, టిడిపి నాయకులు మరియు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Scroll to Top