నంద్యాలలో ఘనంగా టీడీపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పుట్టినరోజు వేడుకలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 06 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ద్వితీయ కుమారుడు, టీడీపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పుట్టినరోజు వేడుకలు నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఫయాజ్ కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టినరోజును పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మా నాన్నగారు, గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అడుగుజాడల్లో నడుస్తూ, నంద్యాల ప్రజలకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు . ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల ప్రేమే నాకు శ్రీరామరక్ష అని తెలిపారు “.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, యువతను భాగస్వాములను చేస్తూ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఫయాజ్ తెలిపారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి, అలాగే పేద ప్రజల సంక్షేమానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఈ పుట్టినరోజు తనకు మరింత బాధ్యతను గుర్తు చేసిందన్నారు .

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువ నాయకత్వంలో ఫయాజ్ పార్టీ బలోపేతానికి మరియు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు మరియు ఫరూక్ అభిమానులు పాల్గొని ఫయాజ్ కి ఘనంగా సన్మానం చేశారు. సీనియర్ పాత్రికేయులు విజయ్ ఆనంద్,కంభం సతీష్ కుమార్ లు శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to Top