నంద్యాలలో ఊపందుకున్న జనసేన సభ్యత్వాలు

500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన నంద్యాల జనసేన నాయకుడు దొడ్ల సురేష్ చౌదరి

గతంతో పోలిస్తే భారీగా పెరిగిన సభ్యత్వ నమోదు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 18 :

జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న సురేష్ చౌదరి గడిచిన రెండు సంవత్సరాలు పార్టీ కోసం అత్యధిక క్రియాశీలక సభ్యత్వలను నమోదు చేసి పార్టీకి ఎనలేని సేవలు చేశారు. అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఇప్పటికే 560 కి పైగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించారు. పార్టీ ఆయన సేవలను గుర్తించి పార్టీ అఫీషియల్ పేజీ లో ఆయన నమోదు చేసిన సభ్యత్వ నమోదు వివరాలు ఉంచడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రానున్న రోజుల్లో సురేష్ చౌదరికి పార్టీ తరపు నుంచి క్రియాశీలక బాధ్యతలు వస్తాయనీ క్రియాశీలక పదవి ఇస్తే మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని జనసేన పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వీర మహిళలు భావిస్తున్నారు. ఈ నెల 24 వ తేదీ వరకు సభ్యత్వ నమోదు జరుగుతుందని సభ్యత్వం నమోదు చేసుకోవలసిన వారు  ( దొడ్ల సురేష్ ) 7893074445 సంప్రదించాలని కోరారు.

Scroll to Top