నంద్యాలలో ఆర్థిక సాక్షరత శిబిరం

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 11 :

ఆర్బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక సాక్షరత వారోత్సవాల సందర్భంగా నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఆర్థిక సాక్షరత శిబిరం నిర్వహించారు.

కళాశాలల చైర్మన్ శ్రీ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం. రవీందర్ కుమార్, ఆర్‌సెటీ డైరెక్టర్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిఎఫ్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 160 మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొన్నారు.

విద్యార్థులకు పొదుపు అలవాటు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక ప్రణాళికపై అవగాహన కల్పించారు. క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

విద్యార్థుల్లో ఆర్థిక చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Scroll to Top