నంద్యాల వైఎస్సార్ నగర్ లో రూపుదిద్దుకుంటున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి దాతలు చేయూత ఇవ్వండి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 13 :

కేరళ రాష్ట్రంలో శ్రీ  అయ్యప్ప దేవాలయం ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల్లో అయ్యప్ప మాల ధరించి కేరళ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో దీక్ష విరమిస్తారు.ఈ నేపథ్యంలోనే 41 రోజులు నిష్టగా అయ్యప్ప మాల ధరించిన వారు సమీపంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్యం పూజలు చేస్తారు. అయ్యప్ప స్వాములు ప్రతి ఏడాది పెరిగిపోవడంతో అయ్యప్ప దేవాలయాలు నిర్మిస్తున్నారు. దాతల సహకారంతో వివిధ ప్రాంతాల్లో అయ్యప్ప స్వామి దేవాలయాలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నంద్యాల పట్టణం వైఎస్సార్ నగర్ రోజు రోజుకు విస్తరిస్తుంది.అధికంగా పేదవారు అధికసంఖ్యలో దాదాపు 10 వేల మంది అక్కడ నివసిస్తున్నారు.అయ్యప్ప మాల ధరించిన వారు పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం కు వెళ్ళాలంటే దూరాభారం పెరిగిపోయింది.ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ నగర్ కు చెందిన గురుస్వామి టీవీ. రమణ గారు దాదాపు 28 సార్లు అయ్యప్ప మాల ధరించారు,తండ్రి అడుగుజాడల్లో కుమారుడు సోమశేఖర్ సైతం 14 సార్లు మాల ధరించారు. ఆ ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మిస్తే మాలదరించిన భక్తులందరికీ మరియు ప్రజలకి వెసలుబాటు ఉంటుందని ఆలోచించారు. స్థలం,నిర్మాణానికి డబ్బు అధికంగా అవుతుందని అప్పటి హౌసింగ్ మినిస్టర్ శిల్పా మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొనిపోయారు. ప్రభుత్వం రామాలయం,అయ్యప్ప దేవాలయం,కళ్యాణ మండపానికి 52 సెంట్ల స్థలము కేటాయించింది. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప స్వామి దేవాలయం ఏర్పాటు చేయాలని కొందరు పెద్దలు ముందుకు వచ్చి దాతల సహకారంతో దాదాపు కోటి 30 లక్షలతో నిర్మాణం చేపట్టారు.దేవాలయంలో శివాలయం,విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి,సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,వెంకటేశ్వర స్వామి,మాలికా పురుషోత్తమ స్వామి విగ్రహాలను అక్కడే ప్రతిష్టచేయడానికి పనులు మొదలు పెట్టారు.గతంలో అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల వెళ్లిన  సమయంలో  స్వామి వారిని దర్శించుకొని అలాంటి దేవాలయం వైఎస్సార్ నగర్ ఏర్పాటు చేయడానికి అప్పుడే బీజం పడింది.నటి నుంచి నేటి వరకు ఎందరో దాతలు సహాయ సహకారాలు అందించడంతో దాదాపు 80 శాతం దేవాలయం నిర్మాణం పూర్తి అయింది.ఇంకా దేవాలయం పూర్తి కావడానికి దాదాపు 30 లక్షలు అవసరం ఉందని పెద్దలు పేర్కొంటున్నారు.దేవాలయం నిర్మాణం పూర్తి కావడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.దాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వాలను కుంటే ఈ నంబర్ కు ఫోన్ పే చేయాలని 8328335850 కోరారు.దాతలు ఎవరైనా,ఎప్పుడైనా వైఎస్సార్ నగర్ లో నిర్మాణంలో ఉన్న దేవాలయం ను సందర్శించి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు.

Scroll to Top