నంద్యాల ట్రాఫిక్ గందరగోళం

  • జిల్లా కేంద్రం పేరుకే.. ట్రాఫిక్ నియంత్రణలో పూర్తిగా వైఫల్యం
  • ప్రధాన కూడళ్లలో పనిచేయని సిగ్నల్స్ – నెలలుగా మరమ్మతులే లేవు
  • శ్రీనివాస్ సెంటర్ తప్ప మిగతా చోట్ల ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 21 :

నంద్యాల జిల్లాలో స్కూల్,కాలేజీ బస్సుల రద్దీతో ఉదయం–సాయంత్రం నరకయాతన..ఎవరికి వారే దూసుకెళ్తూ ప్రమాదాలకు ఆహ్వానం..పద్మావతి నగర్,మున్సిపల్ కార్యాలయం, నూనెపల్లి కూడళ్లలో తీవ్ర గందరగోళం..సీసీ కెమెరాలు ఉన్నా పర్యవేక్షణపై స్పష్టత లేదు..రోడ్లపై అనధికార పార్కింగ్,ఆక్రమణలతో ట్రాఫిక్‌కు ముట్టడి..ప్రమాదం జరిగే వరకు అధికారులు స్పందించరా..?? ప్రజల్లో ఆగ్రహం..!!

“సిగ్నల్స్ లేవు– పోలీసులు లేరు– నియంత్రణ ఎక్కడ..??” పట్టణ ప్రజల మిలియన్ డాలర్ ప్రశ్న..చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన..ఉన్నతాధికారుల పర్యటనలే గాని..శాశ్వత పరిష్కారం మాత్రం గాలిలోనే..వెంటనే సిగ్నల్స్ మరమ్మతు – ప్రత్యేక ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయాలి..రద్దీ సమయాల్లో కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దారుణం..“ప్రమాదం జరిగాక కాదు–ముందుగానే చర్యలు తీసుకోండి” – అంటూ హెచ్చరిస్తున్న పట్టణ ప్రజలు.

Scroll to Top