


సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 21 :
రంజాన్ పర్వదినం సందర్భంగా నంద్యాల జిల్లావ్యాప్తంగా మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మసీదులు, ఈద్గా ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రతను మరింత బలోపేతం చేశారు.
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను ప్రణాళికాబద్ధంగా క్రమబద్ధీకరించారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిఘా కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు ఎస్పీ సునీల్ షొరాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
