
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 13 :
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి నల్లమల అభయారణ్యంలో కాలినడకన 42 కిలోమీటర్ల సాహస పాదయాత్ర ద్వారా శ్రీశైల భ్రమరాంబ, సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకునున్నారు.
కాలినడక సాహస పాదయాత్ర శనివారం 14వ తేదీన ఉదయం 04:00 గంటలకు కర్నూలు నుండి బయలుదేరుతుంది, 06:00 గంటలకు ఆత్మకూరు మండలం వెంకటాపురం శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, 06:30 గంటలకు గోశాయి కట్ట శ్రీ ఆంజనేయ స్వామికీ ప్రత్యేక పూజలు, అనంతరం నాగలూటి చెంచు గూడెంలోని ముర్తుజావలి దర్గాలో ప్రార్థన, 07:30 – ఉదయం 08:30 గంటలకు నల్లమల అరణ్యంలో నాగలూటి వీరభధ్రాలయం రస్తా లోని అటవీశాఖ భేష్ క్యాంప్ వద్ద అల్పాహార విరామం. అక్కడి నుంచి నాగలూటి వీరభద్రాలయం పూజలు, 30 ఏళ్లుగా శ్రీశైలం పాదయాత్రికులకు అన్నదానం చేస్తున్న నిర్వాహకులతో మాట్లాడి తాపలు ( మెట్ల మార్గం) ద్వారా నల్లమల అరణ్యంలోని పెద్ద చెరువు చెంచు గూడెంలో మధ్యాహ్నం 01:00 గం. 02:00 గం.లకు చేరుకొని భోజన విరామం. పెచ్చేర్వు చెంచుగూడెం నుంచి పాదయాత్ర 4 గంటలకు మొదలై భీమునికొలను
చేరుకున్న తర్వాత, ఒక గంట విశ్రాంతి. విశ్రాంతి తర్వాత భీముని కొలను నుంచి శ్రీశైలం బయలుదేరడం.
శ్రీశైలం చేరుకున్న తర్వాత, నేరుగా దర్శనానికి బయలుదేరుతారు.
