

లయన్స్ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ విరూపాక్ష రెడ్డి సౌజన్యంతో
చక్రాల కుర్చీలు రెండు పంపిణీ
దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు ప్రశంసనీయం: లయన్స్ వైస్ గవర్నర్ విరూపాక్ష రెడ్డి.
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 19 :
సోమవారం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ జిల్లా 316 జె వైస్ గవర్నర్ విరూపాక్ష రెడ్డి సౌజన్యంతో చక్రాల కుర్చీలు రెండు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యుడు, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవా కార్యక్రమాలకు ప్రధానంగా లయన్స్ క్లబ్ సభ్యులు, నంద్యాల వైద్యులు,పట్టణ ప్రముఖులు సహకరిస్తున్నారని. గుత్తి పట్టణానికి చెందిన విరూపాక్ష రెడ్డి నంద్యాల దివ్యాంగుల సేవా కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయం అన్నారు.
విరూపాక్ష రెడ్డి మాట్లాడుతూ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం, నంద్యాల లయన్స్ క్లబ్ దివ్యాంగులకు గత రెండు దశాబ్దాలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. తన సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామన్నారు. తాను జూలై నెలలో లయన్స్ జిల్లా గవర్నర్ బాధ్యతలు స్వీకరించాక పదివేల రూపాయల పైగా ఖరీదు చేసే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ fనిరోధక వ్యాక్సిన్ పేద బాలికలకు ఉచితంగా అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ సహకారంతో కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలలో ఉన్న లయన్స్ క్లబ్ ల ద్వారా అందజేసే కార్యక్రమం చేపట్టబోతున్నా మని చెప్పారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా రెండవ వైస్ గవర్నర్ నెల్లూరు జిల్లా గూడూరు కు చెందిన ఆర్.వి. రావు మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ 55 సంవత్సరాలకు పైగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకం అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా ప్రధమ వైస్ గవర్నర్ విరూపాక్ష రెడ్డి, రెండవ వైస్ గవర్నర్ ఆర్.వి. రావు, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య,లయన్స్ రీజనల్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, గుత్తి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహబూబ్ బాషా, నంద్యాల లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు రవి ప్రకాష్, పోసిన సుబ్బారావు,రైల్వే వెంకటేశ్వర్లు,తోట శ్రీనివాస్, రామయ్య,వాసు తదితరులు పాల్గొన్నారు.
