తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాయలసీమకు ద్రోహం చేసిన చంద్రబాబు – ఎమ్మెల్సీ ఇసాక్ బాషా

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి /జనవరి 5 :

నంద్యాల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేతులు కలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేశారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తాము నిలిపివేయించామని స్పష్టంగా ప్రకటించడం, రాయలసీమ ప్రజలపై జరుగుతున్న ద్రోహానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

2020లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతంలో ఉన్న తీవ్ర కరువును శాశ్వతంగా తీర్చాలనే సంకల్పంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ రైతులకు జీవనాధారమని, లక్షలాది మంది ప్రజల ఆశగా మారిందని అన్నారు.

ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకుని, NGTలో ప్రాజెక్టుకు అనుకూలంగా వాదించి, పనులు వెంటనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి  నాయకత్వంలో రాయలసీమ హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని, ఈ ప్రాజెక్టును ఎలాంటి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారు మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి గారు,రైతు విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్ట్, నంద్యాల్ల జిల్లా ఉపాధ్యక్షులు దల్మిల్ అమీర్ మరియు సూర్య నారాయణ రెడ్డి గారు రాష్ట్ర వైసిపి ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశి కళ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top