

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 13 :
నంద్యాల మండలములోని మునగాల గ్రామము నందు డ్రోన్ ఆప్ ద్వారా బుకింగ్ చేసుకొని పిచికారి చేస్తున్న పొలాన్ని మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు పరిశీలించడం జరిగినది . ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నంద్యాల వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న డ్రోన్ ఆప్ ను రైతులు మొబైల్ ఫోన్ నందు డౌన్లోడ్ చేసుకుని వారికి సమీపంలోని సర్వీసు ప్రొవైడర్ ను ఎంపిక చేసుకొని, వారికి అవసరమైన తేదీ నందు , కావలసిన సమయమును ఎన్నుకొని క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపారు. రైతు బుకింగ్ చేసిన వెంటనే సంబధిత సర్వీసు ప్రొవైడర్ కు వారి అభ్యర్థన చేరుతుందని, తర్వాత డ్రోన్ కలిగిన సర్వీస్ ప్రొవైడర్ రైతు ఎన్నుకున్న తేదీన, వారు కోరిన సమయానికి ఆ గ్రామానికి వచ్చి పిచికారి చేయడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకావాలని సూచించారు.
