

సత్యం వార్త / నంద్యాల /జనవరి 5 :
నేషనల్ డిగ్రీ కళాశాలకు చెందిన 56 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు సుదరలాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ లో అసోసియేట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైనట్లు నేషనల్ విద్యాసంస్థల అధినేత డా. యస్. ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు.. సోమవారం నాడు కళాశాల లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొని ఉద్యోగాలకు ఎంపికైన వారికీ కంపెనీ ఆఫర్ లెటర్స్ ను అందజేశారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తమ డిగ్రీ కళాశాల లో ఫైనల్ ఇయర్ బి. సి. ఏ.,మరియు బి. కామ్. ( కంప్యూటర్స్ ) గ్రూపుకు చెందిన 56 మంది విద్యార్థులు సంవత్సరానికి 2.50 లక్షల వార్షిక వేతనం తో సుథెర్లండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ కి ఎంపికై, ప్రాంగణ ఎంపిక ల ద్వారా కళాశాల లో ఉన్నపుడే ఉద్యోగాలు సాధించే నేషనల్ కళాశాల కు ఉన్న బ్రాండ్ ను మరోసారి నిరూపించటం జరిగిందని అన్నారు.. ఆన్లైన్ రాత పరీక్ష మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మౌఖిక పరీక్ష లు నిర్వహించి, ఈ ఉద్యోగాలకు ఎంపిక జేయడం జరిగింది.. ఈ విద్యాసంవత్సరం లో ఇప్పటివరకు వివిధ కంపెనీ లలో 150 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించటం జరిగిందని, ఇంకా కొన్ని కంపెనీ ల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.. ఇంత భారీ సంఖ్య లోవిద్యార్థులను ఉద్యోగాలకు ఎంపికయ్యేలా కృషి చేసిన కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మరియు ప్లేసెమెంట్ ఆఫీసర్ సాయికుమార్ లకు ఆయన అభినందనలు తెలిపారు.. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ.. నేషనల్ డిగ్రీ కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం విలువలు మరియు క్రమశిక్షణ తో కూడిన విద్యను అందించడం వల్ల తాము ఈ విజయాలను సాధించినట్లు తెలిపారు..
