ట్రాఫిక్ క్రమబద్ధీకరణను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 19 :

శ్రీశైలం నందు ఉగాది మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా నేడు చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలంనకు  వచ్చిన భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శించుకొని తిరిగి తమ సొంత ప్రదేశాలకు చేరుకోనున్న నేపథ్యంలో భక్తులకు మరియు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతోపాటు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. కావున వాహనదారులు తొందరపడకుండా పోలీస్ వారికి సూచనలను అనుసరిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని విజ్ఞప్తి చేశారు.

Scroll to Top