



సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 31 :
నంద్యాల జిల్లా మాదకద్రవ్య నిర్మూలన కమిటీ నంద్యాల జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లలో గంజాయి పై 36 కేసులు నమోదు కాగా ఈ కేసులలో స్వాధీనం చేసుకున్న 122కేజీల 498 గ్రాముల గంజాయిని నాశనం చేయడానికి ఎన్డిపిఎస్ చట్టం నిబంధనల ప్రకారం నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ మరియు నంద్యాల జిల్లా డిడిసి కమిటీ సభ్యులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మరియు పంచాయతీదారుల సమక్షంలో 31.01.2026 తేదీన జెఎస్డబ్ల్యూ సిమెంట్ లిమిటెడ్ (జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ) మెషినరీలో గంజాయిని దహనం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిషన్ ఎన్. యుగంధర్ బాబు, డి ఎస్పీ ప్రమోద్ , డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి, సంబంధిత SHO లు (ఇన్స్పెక్టర్లు) DDC కమిటీ సభ్యులు, గడివేముల తాసిల్దార్ , పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు VRO లు పాల్గొన్నారు.
