జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కేంద్రం ప్రారంభం

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట రమణ

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 04:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట రమణ తెలిపారు.  జిల్లాలో చిన్నారుల్లో జన్మతహ లోపాలు,శారీరక వైకల్యాలు,ఎదుగుదల లోపాలు,మానసిక సమస్యలు,వినికిడి–మాట లోపాలు వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి పేర్కొన్నారు.  ఈ డిఈఐసి కేంద్రంలో 0 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు,అవసరమైన చికిత్సలు,ఫిజియోథెరపీ,స్పీచ్ థెరపీ,కౌన్సెలింగ్ వంటి సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రత్యేక నిపుణుల బృందం ద్వారా పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి,అవసరమైన చికిత్సా ప్రణాళిక రూపొందించనున్నామని తెలిపారు..అదేవిధంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు,పాఠశాలలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గుర్తించిన పిల్లలను ఈ  డిఈఐసి కేంద్రానికి రిఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు..జిల్లాలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఇది ఒక కీలక ముందడుగని,తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట రమణ విజ్ఞప్తి చేశారు.

Scroll to Top