
నంద్యాల జిల్లా / జనవరి 03- 2026 / సత్యం వార్త ప్రతినిధి :
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం, కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం, జానాలగూడెం, సంగమేశ్వరం గ్రామాలకు చెందిన కృష్ణానది పై ఆధారపడి జీవిస్తున్న జాలర్లు 30 మందికి లైఫ్ జాకెట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణి చేశారు.
శనివారం నందికొట్కూరు పట్టణం లోని బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్వగృహంలో మర బోటు నిర్వహణ సహాయకులకు గెయిల్ ఇండియా లిమిటెడ్ సి ఎస్ ఆర్ నిధుల సహకారంతో దాదాపు రూ.లక్ష విలువ చేసే 30 లైఫ్ జాకెట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దేశ్వరం, సంగమేశ్వరం, జానాల గూడెం బలపాలతిప్పి గ్రామాల జాలర్లు వెంకటేశ్వర్లు, తిక్కస్వామి, సాలన్న, దాసరి వెంకటేష్, దేవదాసు, చెన్నయ్య, శేఖర్, మౌలాలి, గుడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
