ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 15 :
నంద్యాల రైతు నగరం హైవే పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, అయ్యలూరు మహిళా నాయకురాలు బైరెడ్డి శంకరమ్మ మనవడు శ్రేయాస్ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ చిరంజీవి శ్రేయాస్ రెడ్డిని ఆశీర్వదించి, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బైరెడ్డి శంకరమ్మ కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , వీర సింహారెడ్డి, పిట్టల హనీఫ్ , రవి చౌదరి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందజేశారు
