కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు – మంత్రి ఎన్ఎండి ఫరూక్

తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఒక అధినేతతో సమానమని, వారి కృషితోనే పార్టీ పటిష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీ ప్రాణమని సాధారణ కార్యకర్తను కూడా గౌరవించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారిని గుర్తించి, గౌరవించుకోవడం మన బాధ్యతన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్యకర్తలను మంత్రి ఫరూక్ ప్రత్యేకంగా అభినందించి, అవార్డులతో సత్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఆయన కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకొని వెళ్లాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీకి అభివృద్ధి కంటే “శవ రాజకీయాలు” చేయడమే వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి విమర్శించారు. వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో సొంత పార్టీ కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదని. కానీ టీడీపీ ఎప్పుడూ కార్యకర్త సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని.” ఆయన అన్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను, ఫేక్ వార్తలను కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, వివిధ గ్రామల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top