
సత్యం వార్త / నంద్యాల / మార్చి 25 :
నంద్యాలలో ఫుడ్, వాటర్ సమస్యల కారణంగా బుడగ జంగాల సమాజానికి చెందిన చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలు కలిపి సుమారు 80 మంది అనారోగ్యానికి గురయ్యారని బుడగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ తెలిపారు. బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మధు చిన్నపిల్లల ఆసుపత్రి, శిల్ప, సిసింద్రీ, కేవీఆర్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిరిశాల జమ్మన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
